Search
Wednesday 14 November 2018
  • :
  • :

అక్టోబర్‌ నుంచి రూ.1000 నిరుద్యోగ భృతి

nara

అమరావతి: వచ్చే ఎన్నికల నాటికి రూ.900 కోట్ల వ్యయంతో జిల్లాలో ప్రతి ఇంటికి కుళాయి ఇస్తామని ఎపి మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో జరిగిన గ్రామ దర్శిని కార్యక్రమంలో మంత్రి  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. వచ్చే అక్టోబర్‌ నాటి నుంచి నిరుద్యోగ యువతకు రూ.1000ల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకుడు జగన్‌ ఒక్క మాటా కూడా అనరని మంత్రి విమర్శించారు. ప్రధానిని విమర్శించిన మరుసటి రోజే జైలుకు పోతాననే భయంతోనే జగన్ విమర్శించడం లేదని నారా లోకేశ్ పేర్కొన్నారు.

Comments

comments