Home సినిమా హీరోలు కుక్కలను చూస్తే భయపడుతారు : ఆర్.కృష్ణయ్య

హీరోలు కుక్కలను చూస్తే భయపడుతారు : ఆర్.కృష్ణయ్య

Krishnaiah Talked about Former Crop Loan
MLA R Krishnaiah comments Cinema Heroes are afraid of dogs

హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌ను నిర్మూలించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంఎల్‌ఎ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం క్యాస్టింగ్ కౌచ్‌పై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సినిమా హీరోలందరూ నిజ జీవితంలో హీరోలు కారని,వారు కుక్కను చూస్తే పారిపోతారని కృష్ణయ్య ధ్వజమెత్తారు. తెలుగు సినిమా హీరోల వద్ద వందల ఎకరాలు ఉన్నాయని ఆయన అన్నారు. వారి భూములను పేదలకు పంచకుంటే గుడిసెలు వేయిస్తామని ఆయన హెచ్చరించారు. సినిమా స్టూడియోల్లో ఏం జరుగుతుందో పర్యవేక్షణ లేదని ఆయన పేర్కొన్నారు. సినీ రంగంలో జరుగుతున్న వివిధ ఘటనలపై సినిమా మంత్రిత్వ శాఖకు అసలు పట్టింపే లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. సినిమా రంగంలో జరుగుతున్న అకృత్యాలపై కమిటీ వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరామ్ మాట్లాడారు. తెలుగు సినీ రంగంలో మహిళా నటుల డిమాండ్లకు తాము పూర్తి మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. తెలుగు నటులకే 90శాతం అవకాశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమా రంగంలో నటీమణులపై అకృత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంభిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. నటుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలపై కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసిన వ్యాఖ్యలపై నటి అపూర్వ ఖండిస్తూ, పవన్ క్షమించాలని కోరగా, దీనిపై స్పందించిన మరో నటి శ్రీరెడ్డి, ఒయు విద్యార్థి జెఎసి అపూర్వ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని, పవన్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు.