Home తాజా వార్తలు రెడ్ హాట్ బేబీ

రెడ్ హాట్ బేబీ

హీరోయిన్‌గా సినిమాలు చేయడంతో పాటుగా స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూస్తున్న బ్యూటీ రాయ్ లక్ష్మి. ఈ ఘాటు భామకు సౌత్ అంతా గుర్తింపు ఉంది. హిందీలో కూడా ‘జూలీ 2’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. టాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసింది కానీ ఐటమ్ బ్యూటీగానే ఎక్కువ పాపులర్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ లో ‘రత్తాలు రత్తాలు…’ పాటలో డ్యాన్స్ చేయడంతో భారీగా గుర్తింపు దక్కింది ఈ భామకు. అయితే ఈ హాట్ బ్యూటీకి ఒక క్రేజీ హాబీ ఉంది. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేసి సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్ట్టాగ్రామ్ ఖాతా ద్వారా అదే పని చేసింది.

ఈ ఫోటోకు ‘నేను అమితంగా ఇష్టపడేది ఏంటో తెలుసా? ప్రయత్నం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే జీవితంలో ఏది సాధించాలన్నా దానికి తగిన ప్రయత్నం చేయాలి. ఇక ఈ ఫొటోలో రెడ్ కలర్ బికినీలో ఒక స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి ఖజురహో శిల్పంలా పోజిచ్చింది రాయ్ లక్ష్మి. ఈ బ్యూటీ అందచందాలను చూసి యువకులు ఫిదా అయిపోతున్నారు. పలువురు నెటిజన్లు స్పందిస్తూ… ‘రెడ్ హాట్ బేబీ’.. ‘క్లాసిక్ పోజ్.. కిల్లింగ్ లుక్స్’.. ‘అందాల దేవత’.. ‘ఎర్ర మిరపకాయ్’ అంటూ డిఫరెంట్ కామెంట్లు పెట్టారు. ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో ‘సిండ్రెల్లా’ అనే చిత్రంలోనూ, కన్నడలో ’ఝాన్సీ’ అని మూవీలోనూ నటిస్తోంది.

Raai Laxmi hot red bikini still share in Instagram