Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

‘టెంపర్’ రీమేక్‌లో రాశీ ఖన్నా

Raashi Khanna to team up with Vishal in Temper remake

ఎన్టీఆర్‌కు బ్లాక్‌బస్టర్ హిట్‌నిచ్చిన చిత్రం ‘టెంపర్’. ఈ చిత్రం వచ్చిన మూడేళ్ల తర్వాత ఇతర భాషల్లో ఈ సినిమా రీమేక్ అవుతోంది. హిందీలో రణబీర్‌కపూర్ హీరోగా సైఫ్ అలీఖాన్ కూతురు సారా హీరోయిన్‌గా రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. డిసెంబర్ చివరి వారంలో ఈ చిత్రం విడుదలకానుంది. ఇక తమిళ్‌లో ‘టెంపర్’ రీమేక్ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. విశాల్ హీరోగా రూపొందే ఈ సినిమాకు ‘అయోగ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగులో ఈ పదానికి పనికిరానివాడు అని అర్థం. ఈ టైటిల్ అక్కడ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ రాశీఖన్నాను తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ‘తొలిప్రేమ’తో కొత్త మేకోవర్‌లో ఫామ్‌లోకి వచ్చిన రాశీకి ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సామ్ సంగీత దర్శకుడు. విజయ దేవరకొండ ‘నోటా’కు మ్యూజిక్ ఇస్తోంది కూడా ఇతనే.

Comments

comments