Home తాజా వార్తలు రబడాకు అవార్డుల పంట

రబడాకు అవార్డుల పంట

rabada

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ కసిగో రబడాకు అవార్డుల పంట పండింది. ఇప్పటికే ప్రపంచంలో నంబర్‌వన్ బౌలర్‌గా నిలిచిన రబడా అవార్డుల్లోనూ సత్తా చాటాడు. బౌలింగ్‌తో పాటు అవార్డులు అందుకోవడంలో తనకు ఎవరూ పోటీ లేరని మరోసారి నిరూపించాడు. ఒకే సారి ఆరు అవార్డులు గెలుచుకొని సంచలనం సృష్టించాడు. ఇప్పటి వరకు కేవలం 30 టెస్టులు మాత్రమే ఆడిన రబడా ఏకంగా 143 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించిన అవార్డుల్లో రబడా ఆరింటిని సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును రబడా సాధించాడు. ఈ అవార్డు సాధించడం రబడాకు ఇది రెండోసారి కావడం విశేషం. 2016లో కూడా ఈ అవార్డు సాధించాడు. అంతేగాక టెస్టు క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్, వన్డే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్‌తో సహా ఆరు అవార్డులను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. కేప్‌టౌన్‌లో క్రికెట్ సౌతాఫ్రికా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రబడాకు ఈ అవార్డులు బహూకరించారు.