Home హైదరాబాద్ నేరాల నియంత్రణలో ‘రాచకొండ’

నేరాల నియంత్రణలో ‘రాచకొండ’

Racha-konda

మన తెలంగాణ/సిటీబ్యూరో
నేరాల నియంత్రణలో… ఛేదనలో రాచకొండ పోలీసులు అన తికాలంలోనే తనదైన ముద్రవేసుకుంటున్నారు. కమిషనరేట్ పరిధిలో క్లిష్టతరమైన కేసులను చేధించడంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. కమిషనరేట్ పరిధి పూర్తిగా నగరశివారు, గ్రామీణ ప్రాంతాలతో కూడుకుని ఉన్నందున నేరాలు అధికంగా జరిగేందుకు, నిందితులు తప్పించుకునేందుకు వీలున్నది. అయి నప్పటికీ కమిషనర్ మహేశ్ భగవత్ సారధ్యంలోని అధికార బృందం తమ ప్రాం తాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం, భద్రతను కల్పించడం, మహి ళలకు భరోసాను అందించడంతో పాటు ఇటు సిబ్బందిలోనూ ఆత్మస్థైర్యాన్ని నింపడంలో సత్ఫలితాలను సాధిస్తున్నది. అందుకు నిదర్శనంగా 2017లో జరిగిన నేరాలు, నేరస్థుల అరెస్టులు, సొత్తు స్వాధీనం వివరాలు నిలుస్తున్నాయి. ము ఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి, కీసర, మౌలాలీ, పహాడీషరీఫ్ ప్రా ంతాలతోపాటు, దేశవిదేశీయ పర్యాటకులు వచ్చే రామోజీ ఫిల్మ్‌సిటీ, వందర్‌లాలు, 86 ఇంజనీరింగ్, సాంకేతిక విద్యా సంస్థలు కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. అయితే, గురువారం రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వార్షిక నివేదికను వెళ్ళడించారు.
నేరాలు… ఛేదన…
షీటీమ్ మొత్తం 1112 కేసులు నమోదు చేయసింది. ఇందులో ప్రధానంగా మెట్రో రైలులో బాలికల ఫోటోలను తీస్తున్న 65 ఏళ్ళ నర్సింహను అదుపులోకి తీసుకున్నారు. కుషాయిగూడలో సత్యనారాయణ(85) పాఠశాల విద్యార్థినిలు 6 మందిపై లైంగిక దాడికిపాల్పడ్డాడు. ఇసిఐఎల్‌లో డిఏఇ పాఠశాల ప్రిన్సిపాల్ మహాపాత్ర(54) 9వ తరగతి విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించాడు. మేడ్చెల్ లింగంపల్లిలో సుదర్శన్‌రెడ్డి(50) అదే ప్రాంతంలోని మహిళపై కామవాంఛను తీర్చాలని వేధించాడు. వనస్థలిపురంలో క్యాబ్ డ్రైవర్ శివకుమార్ ప్రయాణికురాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇదిలా ఉండగా షీ ఫర్ హర్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థినిలు స్వేచ్చాయుత వాతావరణంలో కళాశాలలకు వెళ్ళివచ్చేందుకు భద్రతను, భరోసాను కల్పిస్తున్నట్టు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఈ బృందం వల్ల మొత్తం 14 కేసులు నమోదుచేసి 15 మంది ఈవ్‌టీజర్లపై కేసులు నమోదు చేశారు. షీ ఫర్ హర్ కోసం రెండు బ్యాచ్‌లుగా 300 మంది శిక్షణను పొందారు. కుషాయిగూడ, సరూర్‌నగర్ పోలీసు స్టేషన్‌ల పరిధిలో మహిళల గృహహింసపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు అంకుర, భూమిక అనే కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలపై మొత్తం 515 కేసులు నమోదయ్యాయి.
నయా సవేరా…
కమిషనరేట్ పరిధిలో నూతనంగా నయా సవేరా కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నివారించడాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగాన్ని నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంజనీరింగ్ కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో 4 కార్యక్రమాలు 2017లో నిర్వహించినట్టు తెలిపారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన…
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానుసారంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో పోలీసులు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో మొత్తం 498(బాలికలు192, బాలురు 306), అపరేషన్ ముష్కాన్ 317(బాలికలు 38, బాలురు 279) మందిని కార్మికులుగా ఉన్నవారిని పాఠశాలలకు వెళ్ళేలా చూసినట్టు తెలిపారు. ఈ క్రమంలో 6 కేసులు నమోదుచేయడంతో పాటు 27 మందిని అరెస్టుచేసి రిమాండ్ చేశారు.
సిసిఎస్… ఆర్థిక నేరాలు..
కమిషనరేట్ పరిధిలో ప్రధానంగా మూడు సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సిసిఎస్)లు పనిచేస్తున్నాయి. ఈ మూడు కేంద్రాల్లో 291 కేసులు నమోదయ్యాయి. రూ. 2.68 కోట్లు సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక నేరాలు మొత్తం 3002 కేసులు నమోదు కాగా 1525 కేసులను చేధించారు. ఆర్థికంగా నష్టపోయింది రూ. 23.39 కోట్లు అయితే స్వాధీనం చేసుకున్నది రూ. 10.93 కోట్లుగా వెల్లడించారు.
ఎస్‌ఓటి…
స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్‌ఓటి) మొత్తం 835 కేసులను ఛేదించింది. ఇందులో ప్రధానంగా నకిలీ మధ్యం కేసులు 282, మనుషుల రవాణా కేసులు 82, గేమింగ్ 117, జాబ్‌లంటూ మోసాలు 80, కల్తీ ఆహారపు పదార్థాలు 100 కేసులను ఎస్‌ఓటి ఛేదించింది. శిశు విక్రయాలు, మాదక ద్రవ్యాల రవాణా, మోసాలు, నకిలీ నోట్లు, ఆన్‌లైన్ సెక్స్ రాకెట్, క్రికెట్ బెట్టింగ్, పేలుడు పదార్థాలు వంటివి ఉన్నాయి.
పిడి యాక్ట్…
కమిషనరేట్ పరిధిలో క్రమం తప్పకుండా నేరాలకు పాల్పడుతున్న నిందితులపై పిడి యాక్ట్‌ను ప్రయోగిస్తున్నారు. 2017లో మొత్తం 34 మందిపై పిడియాక్ట్‌ను నమోదుచేశారు. 15 మంది ఇంటి దొంగతనాలు చేసే వారిపైన, 6 నయీం గ్యాంగ్ సభ్యులపైనా, 2 చైన్‌స్నాచర్లపై, 3 భూఆక్రమణదారులపైనా ఈ చట్టాన్ని నమోదుచేశారు. 2017లో మొత్తం 3270 నాన్‌బేయిలబుల్ వారంట్లు జారీ అయ్యాయి. డిసెంబర్ నాటికి 1562 నాన్‌బెయిలబుల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
శిక్షలు… లోక్‌అదాలత్… సిసిటివి పథకం…
2017లో మొత్తం 11,115 కేసుల పరిష్కారం జరిగింది. అందులో 2348 కేసుల్లో శిక్షలు పడ్డాయి. 6241 కేసులు రాజీ కుదర్చుకున్నారు. లోకాదాలత్‌లోనే 6241 కేసుల్లో వాది,ప్రతివాదులు రాజీ కుదుర్చుకున్నారు. నేరాల నియంత్రణ, ఛేదనలో సిసిటివి కెమరాల పాత్ర ప్రధానంగా మారింది. ప్రజాప్రతినిధులు ఉండే 1620 ప్రాంతాల్లో మొత్తం 1120 సిసిటివి కెమరాలను ఏర్పాటు జరిగింది. జిహెచ్‌ఎంసి పరిధిలో మరో 2234 సిసి కెమరాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతిని మంజూరుచేసినట్టు కమిషనర్ భగవత్ వెల్లడించారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో 11 మండలాల్లో సిసికెమరాల ఏర్పాటు పూర్తయిందని వచ్చే వారంలో ప్రారంభం కానున్నాయి. అలేరు మండల పరిధిలో 14 గ్రామాలందు సిసికెమరాలు అమర్చేందుకు ప్రణాళికలు సిద్దమైనట్టు కమిషనర్ వెల్లడించారు.
ట్రాఫిక్ కేసులు… డ్రంక్ అండ్ డ్రైవ్…
2017లో 7,37,288 కేసులను మోటార్ వెహికిల్ చట్టం ప్రకారంగా నమోదు చేసి రూ. 26,50,65,321లను వసూళ్ళు చేసినట్టు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్‌లో 8,105 కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు 72, విద్యార్థులు 70, ఇతర వృత్తి ఉద్యోగులు 5352 మంది ఉన్నారు. కాగా 5591 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. జరిమానాగా రూ. 1,33,18,750లు వసూలయ్యాయి. 556 మందికి సాధారణ జైలు శిక్షపడింది. ఇచాలనా కేసులు 4,87,804 నమోదయ్యాయి. సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు 9991, సిగ్నల్ జంప్ కేసులు 12,034 ఉన్నాయి. 116 ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా 2210 మంది డ్రైవర్లకు రోడ్డు, ట్రాఫిక్ నియమాలు, పాటించాల్సిన విషయాలపై చైతన్య కార్యక్రమాలను నిర్వహించినట్టు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్‌లో మొత్తం 24 కేసులు నమోదు కాగా అందులో 20 మంది మరణించారు. 31 మందికి గాయాలయ్యాయి. స్పీడ్ లేజర్ గన్‌ల ద్వారా మొత్తం 44,060 కేసులు నమోదయ్యాయి.
సైబర్ సెల్…
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 366 కేసులు నమోదయ్యాయి. ఇందులో కాల్స్ స్పూపింగ్ కేసులు 192, ఆన్‌లైన్ చీటింగ్ 58, సోషల్ మీడియా అకౌంట్స్ నేరాలు 52 నమోదయ్యాయి. కాగా 47 భారతీయులు, విదేశీయులు 13 మంది అరెస్టుచేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని జాంతారా ప్రాంతానికి చెందిన సుమారు 400 మంది యువకులు సైబర్ క్రైం చేస్తున్నట్టు సమాచారమున్నదని, అక్కడకు పోలీసు బృందాలు వెళ్ళి వచ్చినట్టు పలుమార్లు అక్కడ అరెస్టులు చేసినట్టు కమిషనర్ భగవత్ వెల్లడించారు.
మయన్మార్ పౌరులు…
చాంద్రాయణగుట్ట, పహాడిషరీఫ్ ప్రాంతాల్లో మొత్తం 3636 మంది మయన్మార్ దేశస్థులు రోహింగ్యాలు నగరానికి వలసవచ్చినట్టు వెల్లడించారు. గుర్తించడం కొనసాగుతుందన్నారు. కమిషనరేట్ పరిధిలో ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని చేపట్టారు.
సిబ్బంది సంక్షేమం…
విధి నిర్వాహణలో ఎదురయ్యే పలురకాల సమస్యలను అధిగమించేందుకు పోలీసుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఎల్‌ఇడి బాటన్స్, కోన్స్, రేయిన్ కోట్స్, డ్రాగన్ లైట్స్, బ్రీత్ అనలైజర్, రిఫ్లెక్టివ్ టేప్, 5 స్పీడ్ లేజర్ గన్స్, కాటన్ నోస్ మాస్క్, షూస్, గాగూల్స్, వాటర్ బాటల్స్ వంటివి సిబ్బంది కోసం అందిస్తున్నట్టు తెలిపారు.
కొత్త పోలీసు స్టేషన్‌లు…
నగర శివారు ప్రాంతంలో రెండు నూతన పోలీసు స్టేషన్ భవనాలను ఏర్పాటు చేసినట్టు మహేశ్‌భగవత్ వెల్లడించారు. జవహార్‌నగర్, ఆదిభట్ల ప్రాంతంలో అత్యాధునిక వసతులతో కూడిన భవనాలు నిర్మించినట్టు తెలిపారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : కమిషనర్ మహేశ్ భగవత్
ప్రతి పౌరుడు, పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా నేరాలను పూర్తిగా నియంత్రించవచ్చని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. సిసిటివి కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని, వీటి ద్వారా దొంగతనాలు, స్నాచింగ్‌లు చాలా వరకు తగ్గుతాయని, జరిగిన వాటిని వేగంగా ఛేదించడం జరుగుతుందన్నారు. యాదాద్రిలో 50 ఎకరాల్లో ఒక ఏసిపి స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక క్యాంప్ కార్యాలయం ఉంటుందని తెలిపారు. ప్రజలకు సౌలభ్యం కోసం పహాడిషరీప్ కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించినప్పుడు పోలీసులకు సమా చారమివ్వాలని చెప్పారు.

షీటీమ్, నయాసవేరా కార్యక్రమాలు ప్రజా దర్బార్… బాలకార్మిక నిర్మూలన, సిసిఎస్‌లో నమోదైన కేసులు 291 ఆర్థిక నేరాలు 3002 .. చేధించినవి 1525 పట్టుకున్న కేసులు 835పిడి యాక్ట్ ప్రయోగించిన కేసులు 34 శిక్షలు పడిని కేసులు 2348నాన్‌బేయిలబుల్ జారీ అయినవి 3270 డ్రంక్ డ్రైవ్ కేసులు 8,105