Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

క్వార్టర్స్‌లో నాదల్

 మహిళల సింగిల్స్‌లో వోజ్నియాకి ముందుకు
 డిమిత్రొవ్, సిలిక్ గెలుపు, ఆస్ట్రేలియా ఓపెన్

Nada;

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్పెయిన్ యోదుడు రఫెల్ నాదల్, డెన్మార్క్ స్టార్ కరొలిన్ వోజ్నియాకి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మూడో సీడ్ గ్రిగర్ డిమిత్రొవ్ (బల్గేరియా), ఆరోసీడ్ మారిన్ సిలిక్ (క్రొయేసియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ సమరంలో విజయం సాధించారు. అయితే నిక్ కిర్గియాస్ (ఆస్ట్రేలియా), అనెట్ కొంటావెట్ (ఇస్టోనియా) నాలుగో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ సమరంలో టాప్ సీడ్ నాదల్ 63, 76, 46, 76 తేడాతో అర్జింటీనా ఆటగాడు డిగో స్చువార్ట్‌జ్‌మన్‌ను ఓడించాడు. ఈ టోర్నమెంట్‌లో తొలిసారి నాదల్‌కు కాస్త గట్టి పోటీ ఎదురైంది. అయినా చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ నాదల్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న నాదల్‌కు తర్వాతి సెట్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. డిగో అద్భుత పోరాట పటిమ కనబరచడంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. కానీ, కీలక సమయంలో డిగో ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న నాదల్ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. కాగా, నాలుగో సెట్‌లో మాత్రం నాదల్‌కు ఓటమి తప్పలేదు. డిగో అద్భుతంగా ఆడి సెట్‌ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్‌లో కూడా పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఈ సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఒక దశలో డిగో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కానీ, నాదల్ కీలక సమయంలో పుంజుకున్నాడు. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తిస్తూ మ్యాచ్‌ను సొంతం చేసుకుని క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
సిలిక్ ముందుకు…
క్రొయేసియా స్టార్, ఆరో సీడ్ మారిన్ సిలిక్ కూడా పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్‌లో సిలిక్ స్పెయిన్ ఆటగాడు కరెనొ బుస్టా (స్పెయిన్)ను ఓడించాడు. నాలుగు సెట్ల సమరంలో సిలిక్ 67, 63, 76, 76 తేడాతో విజయం సాధించాడు. తొలి సెట్‌ను కోల్పోయిన సిలిక్ తర్వాత చెలరేగి ఆడాడు. వరుసగా మూడు సెట్‌లు గెలిచి ప్రత్యర్థిని మట్టి కరిపించాడు. మరవైపు బుస్టా కూడా గెలుపు కోసం చివరి వరకు పోరాడాడు. రెండు సెట్లను టైబ్రేకర్ వరకు తీసుకెళ్లాడు. అయినా సిలిక్ తన అపార అనుభవాన్ని ఉపయోగించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

Comments

comments