Home జాతీయ వార్తలు సముద్రంలో తెప్ప బోల్తా : ఇద్దరు మృతి

సముద్రంలో తెప్ప బోల్తా : ఇద్దరు మృతి

Raft

విశాఖ : ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం సముద్ర తీరంలో గురువారం తెల్లవారుజామున ఓ తప్ప బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు చనిపోయారు. ఎస్.రాయవరం గ్రామానికి చెందిన ఐదుగురు మత్స్యకారులు సముద్రంపైకి చేపల వేటకు వెళ్లారు. అలల తాకిడికి తెప్ప బోల్తా పడింది. ఈ క్రమంలో తెప్ప ఇంజన్ ఫ్యాన్ తగిలి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే ఉన్న మరో తెప్పలోని వారు వీరిని ఒడ్డుకు చేర్చారు. బాధితులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు చనిపోయారు. మృతులను సోమేష్ (45), ఎం.సత్య (50)లుగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన తాతారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Raft at Roll over in sea : Two fishermen died