Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటిన తెలుగు తేజం

Ragala Venkata Rahul clinches India's 4th Gold in Commonwealth Games 2018

గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ ఆతిథ్యమిస్తున్న 21వ కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా వెయిట్‌లిఫ్టింగ్ ఆటగాళ్లైతే బంగారు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా తెలుగు తేజం వెంకట రాహుల్‌కు వెయిట్ లిఫ్టింగ్ 85 కిలోల విభాగంలో స్వర్ణం గెలుచుకున్నాడు. దీంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 4కి చేరింది. ఎపిలోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురం వాసి అయినా వెంకట రాహుల్ పసిడి పతకంతో తెలుగొడి సత్తా చాటాడు. ఈ రోజు జరిగిన పోటీల్లో 338 కిలోల బరువును ఎత్తి రాహుల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా లిఫ్టింగ్ విభాగంలో మీరాభాయ్ ఛాను, సంజితా ఛాను, సతీష్ కుమార్‌కు స్వర్ణ పతకం లభించిన విషయం తెలిసిందే. ఇప్పటీ వరకు ఇండియా మొత్తం నాల్గు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలుచుకుంది.

Ragala Venkata Rahul clinches India’s 4th Gold in Commonwealth Games 2018.

Comments

comments