Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

బర్త్‌డే బంప్స్ పైశాచికం!… వీడియో

ఇదో రకం ర్యాగింగ్
విద్యార్థుల్లో భయాందోళనలు
గాయపడిన గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి

సిటీబ్యూరో: నగరంలో ఇంజినీరింగ్ విద్యార్థులు బరితెగి స్తున్నారు. కళాశాల వార్షిక సంబురాలు, ర్యాగింగ్‌లు, బర్త్ డే పార్టీల ముసుగులో ఇంజినీరింగ్ విద్యార్థుల వికృత క్రీడలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. తాజాగా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరిం గ్ విద్యార్థులు ‘బర్త్ డే బంప్స్’ పేరుతో తోటి విద్యార్థి పుట్టిన రోజు వేడుకల్లో బర్త్ డే బంప్స్ పేరుతో సదరు విద్యార్థిని కాళ్లు చేతులు పట్టుకుని చిత్రహింసలకు గురి చేశారు. వీరి బాధలు భరించలేక సదరు విద్యార్థి సొంతూ రుకు చెక్కేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. కాగా బర్త్ డే బంప్స్ నెపంతో విద్యార్థిని చిత్రహింసలకు గురిచేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు సుమోటో కేసు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.

అయితే కళాశాల పేరు అప్రతి ష్టపాలవుతుందని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బర్త్ డే పార్టీ పేరుతో జరుగుతున్న ఈ తరహా ర్యాగింగ్ ఇప్పుడు విద్యా ర్థులను ఆందోళనకు గురిచేస్తుంది. దీన్ని ఆధిలోనే ఆపకుంటే రానున్న రోజుల్లో మరికొందరు విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సాగించి న ఈ వికృత క్రీడకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాలకు చెందిన వ్యాపారి అశోక్ కుమారుడు వినీత్ ఇబ్రహీం పట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో చేరాడు. అయితే ఈ నెల 26వ తేదీన వినీత్ పుట్టిన రోజు. వినీత్ బర్త్ డే విషయం తోటి విద్యార్థుల ద్వారా కొద్ది రోజుల ముందు సీనియర్ల చెవిన పడింది. ఇంకేముందు కొద్దిరోజులుగా బర్త్‌డే బంప్స్ అలవాటుపడ్డ విద్యార్థులు అతడిని టార్గెట్ చేశారు. బర్త్‌డే పార్టీ ఇవ్వమని సీనియర్లు బలవంతం చేయడంతో వినీత్ అంగీకరించాడు.

సీనియర్లు చెప్పినట్లు కాలేజీలోని అందరికి బిర్యాని పార్టీ ఇచ్చాడు. అదే బర్త్‌డే బంప్స్ అనుకున్నాడు వినీత్. కేక్ కట్ చేయకముందే సీనియర్లు వచ్చి అతని శరీరమంతా కేక్‌ను పూశారు. ఆ తరువాత బర్త్ డే బంప్స్ చూపిస్తామని చెప్పారు. అత ను తేరుకోకముందే చేతులు, కాళ్లు పట్టుకుని అతడిని గాలిలోకి లేపారు. వినీత్ విడిచిపెట్టాలంటూ కేకలు వేసినా ఎవరు కనికరించ లేదు. వీపుమీద, కాళ్ళతో ఇష్టం వచ్చినట్లు తొక్కారు. దీంతో వినీత్ తీవ్రంగా గాయపడ్డాడు. సీనియర్ల వేధింపులకు భయపడ్డ వినీత్ సొంతూరికి చెక్కేశాడు.అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా పోలీసులు మాత్రం స్పందించలేదు. వీడియో ఆధారంగా నైనా సుమోటో కేసు పెట్టి.. సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకు నే అవకాశం ఉంది. అయితే కళాశాల యమాజమాన్యం ఒత్తిడి మేర కు పోలీసులు గప్‌చుప్‌గా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బర్త్ డే బంప్స్ పేరుతో జరుగుతున్న ఈ విష సంస్కృతికి చెక్ పెట్టి విద్యార్థులకు రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

Courtesy by Sakshi TV

Comments

comments