Search
Monday 24 September 2018
  • :
  • :

కేరళకు లారెన్స్ కోటి విరాళం…

Raghava Lawrence donates Rs 1 Crore to flood victims

చెన్నె: నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. అనాథ పిల్లలను ఆదుకోవడం సహా, సలు సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. భారీ వర్షాల కారణంగా కేరళలో వందల మంది చనిపోగా, వేలమంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలు,వరదలు కేరళ ను అతలాకుతలం చేశాయి. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు కేరళకు మద్దతుగా నిలిచారు. కష్ట సమయంలో  ఆదుకునేందుకు తమ వంతు సాయం చేశారు.  ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఏకంగా రూ. కోటి విరాళం ప్రకటించారు. కేరళ వరద బాధితుల కోసం నేను రూ.కోటి విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. మన సోదరులు, సోదరీమణులైన కేరళ ప్రజల జీవితాన్ని వరదలు చిన్నాభిన్నం చేశాయి. ఆ విషయం నన్నెంతో బాధిస్తోందని ఆయన అన్నారు.

Comments

comments