Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

లారెన్స్‌కి మ‌ద‌ర్ థెరిసా అవార్డ్

Raghava Lawrence receives Mother Teresa award

చెన్నై: నటుడు, దర్శకుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్  ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ బాగా పాపులర్ అనే విషయం తెలసిందే. కేవ‌లం సినిమాలతోనే కాకుండా సామాజిక సేవలతోను ప్రజలల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు లారెన్స్. కష్టాలలో ఉన్నవారికి తన వంతు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా  లారెన్స్‌ పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 150కి పైగా చిన్నారుల‌కి ఓపెన్ హార్ట్ శస్త్ర చికిత్సలు చేయించారు లారెన్స్. అతడి సేవా గుణాన్ని గుర్తించిన మదర్‌ థెరిసా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు థెరిసా 108వ జయంతి సందర్భంగా గురువారం సాయంత్రం చెన్నై, తేరనాపేటలోని కామరాజర్‌ ఆవరణలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో లారెన్స్‌కి మ‌ద‌ర్ థెరిసా అవార్డ్తో స‌త్క‌రించారు. ఈ విష‌యాన్ని లారెన్స్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.  అనాధ‌ల‌కి అండగా నిలిచే లారెన్స్ ఇటీవ‌ల కేర‌ళ వ‌ర‌ద‌ల వ‌ల‌న నిరాశ్ర‌యిల‌న వారికి కోటి రూపాయ‌లు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

Telangana Breaking News

Comments

comments