Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎస్‌విబిసి చైర్మన్‌ పదవికి రాఘవేంద్రరావు రాజీనామా

ఎస్‌విబిసి చైర్మన్‌ పదవికి రాఘవేంద్రరావు రాజీనామా

Raghavendra Raoతిరుమల : ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు శ్రీవేంకటేశ్వరా భక్తిచానల్‌ (ఎస్‌వీబీసీ) చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. టిటిడి ఈ ఆధ్యాత్మిక చానెల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. 2015 నుంచి టిటిడి బోర్డు సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన  ఎస్‌విబిసి చానల్‌ కు చైర్మన్ గా వ్యవహరిస్తూ, ఈ చానల్ బాధ్యతలను చూస్తున్నారు. వయోభారం కారణంగా  ఈ బాధ్యతలను సరిగా నిర్వహించలేకపోతున్నానని రాఘవేంద్రరావు తెలిపారు. అందుకే చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.  టిటిడి యాజమాన్యానికి, సిబ్బందికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇంతకాలం తనకు సహకరించిన టిడిపి యాజమాన్యం, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Raghavendra Rao Resigned To SVBC Chairman Post