Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

రఘు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

పోలీసుల పాత్రపై నివేదిక సమర్పించాలంటూ ఎస్‌పికి హెచ్‌ఆర్‌సి నోటీసులు

raghu

సిటీబ్యూరో: నల్లగొం డ జిల్లా గుడిపల్లి ఎస్‌ఐ రాఘవేందర్ రెడ్డి, కానిస్టేబుల్  దుర్గారెడ్డి చిత్రహింస లు భరించలేక  రఘు (21) అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సి) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపి ఏప్రిల్ 4వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఎస్‌పి ప్రకాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. రఘు మృతికి పోలీసులే కారణమైనందునా వారిపై కేసులు న మోదు చేసి అరెస్టు చేయాలని రఘు తండ్రి ఏలాద్రి సోమవారం పిటిషన్ వేయడంతో హెచ్‌ఆర్‌సి స్పందిం చింది.

మరోపక్క రఘు మృతిపై మీడియాలో వచ్చిన వా ర్తలకు గుడిపల్లి పోలీసులు షాక్‌కు గురయ్యారు. రఘు మృతిపై పోలీసుల పాత్ర ఉందని ఫిర్యాదులో తండ్రి  పే ర్కొన్న పోలీసు అధికారుల పేర్లు తొలగిస్తేనే పోస్టుమా ర్టంకు సహకరిస్తామని బెదిరించిన పోలీ సులు ఎట్టకేలకు తలొగ్గారు. రెండు రో జుల నుంచి పోస్టుమార్టం కోసం ఎదు రుచూస్తున్న రఘు మృతదేహానికి పోలీ సులు సహకరించడంతో గాంధీ మార్చు రీ వైద్యులు సోమవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ స భ్యులకు అందజేశారు. రఘు ఇంటి ఎ దురుగా ఉంటున్న ఓ అమ్మాయిని ప్రే మించాడు. వీరి ప్రేమను భగ్నం చేసేం దుకు అమ్మాయి తండ్రి పోలీసుల సహకారం తీసుకుని రఘుపై దొంగతనం ఆరోపణ మోపడంతో పాటు స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేయడంతో రఘు ఆత్మ హత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

Comments

comments