Home బిజినెస్ ఆర్‌బిఐ సీట్ బెల్ట్ లాంటిది

ఆర్‌బిఐ సీట్ బెల్ట్ లాంటిది

Raghuram Rajan wants RBI to play like Rahul Dravid

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) స్వయం ప్రతిపత్తిని మాజీ ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్ గట్టిగా సమర్థించారు. ఆర్‌బిఐ, ప్రభుత్వం మధ్య విభేదాలు పెరిగిన నేపథ్యంలో రాజన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో తన అభిప్రాయాలను వెల్లడించారు. తనదేన శైలిలో అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్‌బిఐ బోర్డుకు చురకలంటించారు. డ్రైవర్ వంటి ప్రభుత్వానికి సెంట్రల్ బ్యాంక్ ‘సీట్ బెల్ట్’ లాంటిదని ఆయన అభివర్ణించారు. అయితే సీట్ బెల్ట్‌ను వినియోగించుకోవాలా? వద్దా? అనేది ప్రభుత్వమే నిర్ణస్తుందని అన్నారు. అలాగే ఆర్‌బిఐ బోర్డు రాహుల్ డ్రావిడ్ లాగా ఆడాల్సిన అవసరం ఉందని, నవజోత్ సింగ్ సిద్ధూ లాగా ఆడకూడదని అన్నారు. ఘర్షణాత్మక వైఖరి కాకుండా, రక్షణాత్మక ధోరణిలో ఆర్‌బిఐ వ్యవహరించాలని ఆయన బోర్డుకు సూచించారు. ప్రభుత్వం ఇటీవల ఎన్నడూ లేనివిధంగా ఆర్‌బిఐపై అధికారాలను వినియోగిస్తూ.. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు మూడు లేఖలను పంపింది.

ఇది సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాధికారాలపై ప్రభావం చూపే అవకాశముందని, స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా రాజన్ స్పందిస్తూ.. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఆర్‌బిఐ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుందని, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం కృషి చేస్తుందని అన్నారు. అభివృద్ధికి బాధ్యత వహిస్తున్న అన్ని సంస్థలకు గరిష్ట స్వేచ్ఛను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. దీని వల్ల ప్రభుత్వం, ఆర్‌బిఐ మద్య విబేధాలు పెరుగుతాయి. ఇద్దరి అభిప్రాయాలు వేరుగా ఉన్నప్పుడు ఒకరినొకరు చర్చించుకున్నప్పుడు కొన్ని వాస్తవాలు తెలుస్తాయని రాజన్ అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బిఐ బోర్డు రాహుల్ ద్రావిడ్‌లాగా వ్యవహరించాలని, నవజోత్ సిద్ధులా దూకుడుగా ఉండకూదని రాజన్ వ్యాఖ్యానించారు. జాతీయ సంస్థ ఆర్‌బిఐ కాపాడుకోవాల్సి అవసరం ఉందని రాజన్ పేర్కొన్నారు. ఆర్థికమంత్రిత్వ శాఖ, ఆర్‌బిఐ మధ్య అనారోగ్యకరమైన భిన్నాభిప్రాయాలను బహిరంగపర్చడం ద్వారా మరింత దిగజార్చుకోకూడదని అన్నారు. ఒకసారి ఆర్‌బిఐ గవర్నర్‌గానో, డిప్యూటీ గవర్నర్‌గానో నియమితులైతే ప్రభుత్వం మాట వినాల్సిందేనని హితవు పలికారు. మరోవైపు ఆర్‌బిఐ స్వయంప్రతిపత్తిపై ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యాఖ్యలను రాజన్ ప్రశంసించారు.
ఎన్‌బిఎఫ్‌సి(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు) వివాదంపై రాజన్ స్పందిస్తూ కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ, ఆర్‌బిఐ మధ్య విబేధాలున్నా, పరస్పర గౌరవం ఇద్దరికీ వుండాలన్నారు. ఆర్‌బిఐ కారు సీట్ బెల్ట్ లాంటిదని అన్నారు. ప్రమాదాలను నివారించాలంటే సీటు బెల్టు పెట్టుకోవడం ముఖ్యమని రాజన్ వ్యాఖ్యానించారు. సీట్ బెల్టు పెట్టుకోవాలా లేదా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వృద్ధిపై దృష్టిపెడితే, ఆర్‌బిఐ ఆర్థిక స్థిరత్వం గురించి ఎక్కువ ఆలోచిస్తుందని రాజన్ అన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే అధికారం కూడా ఆర్‌బిఐకి ఉంటుందని స్పష్టం చేశారు. ఎందుకంటే రాజకీయ, వ్యక్తిగత ప్రాధాన్యతలు ఆర్‌బిఐకి ఉండవని, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమే ఆర్‌బిఐ ప్రధాన లక్షంగా ఉంటుందని అన్నారు. ఈ విషయంలో కేంద్రానికి, ఆర్‌బిఐకి మధ్య భిన్నాభిప్రాయాలున్నప్పటికీ పరస్పరం గౌరవించుకోవడం చాలా ముఖ్యమని రాజన్ అభిప్రాయపడ్డారు. సెక్షన్-7ను ప్రభుత్వం వినియోగించి వుంటే పరిస్థితి మరింత దిగజారేదని తెలిపారు. ద్రవ్యోల్బణం విషయంలో భారతదేశం మెరుగైన పరిస్థితిలోఉందని, ద్రవ్యోల్బణాన్నికట్టడి చేసిన ఘనత ప్రభుత్వం, ఆర్‌బిఐకు దక్కుతుందని అన్నారు.

Raghuram Rajan wants RBI to play like Rahul Dravid

Telangana News