Home భద్రాద్రి కొత్తగూడెం పరుశురామనిగా రఘురాముడు

పరుశురామనిగా రఘురాముడు

 Raghuramudu is Parusuramudi  Embodiment

రఘువంశోత్తమ రాముడు బుధవారం పరుశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా శ్రీసీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో అధ్యనోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ఆరోరోజు శ్రీరామ చంద్రుడు భక్తులకు పరుశురామునిగా దర్శనభాగ్యాన్ని ప్రసాదించారు. భగవంతునికి గర్భగుడిలో అవతారాన్ని ధరింపచేశారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పల్లకీలో మేళతాళాల నడుమ మిథిలా స్టేడియానికి అంగరంగ వైభవంగా తోడ్కొని వచ్చారు.
దారిపోడవునా భక్తుల కోలాహలాల నడుమ, శ్రీరామ్ అంటూ జయజయధ్వానాల సందడి, కోలాట నృత్యాల సవ్వడితో రామచంద్రప్రభువు ప్రత్యేక వేదికపై ఆసీనులయ్యారు. తండ్రి అయిన జమదగ్నిని చంపిన వేయి చేతులు గల కార్యవీంరార్జునున్ని సంహరించి 21 పర్యాయాలు భూమినంతా గాలించి దుష్టులైన వారిని అంతం చేసేందుకు శ్రీరామచంద్రమూర్తి పరుశురామ అవతారం దాల్చారని పురాణం.

ఈ అవతారంలో ఉన్న స్వామివారి ని కొలిస్తే భక్తులకు మంచి జరుగుతుందని, శత్రుభయా లు తొలగిపోయాతని అపార నమ్మకం. అనంతరం స్వామికి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. కోలాట నృత్యాలు, వేదమంత్రోశ్చారణల నడుమ స్వామి తిరువీధి సేవ సాగింది. ఈ కార్యక్రమంలో వేద పండింతులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

నేడు శ్రీరామ అవతారం…
గురువారం స్వామివారు శ్రీరామ అవతారంలో కనిపించ నున్నారు. ఈ అవతారాన్ని రామయ్యకు గర్భగుడిలో ధరింపజేసి మంగళవాయిధ్యాల నడుమ ప్రత్యేక పల్లకీలో మిథిలా స్టేడియానికి తోడుకోస్తారు. అదేవిధంగా అధ్యనోత్సవాల్లో భాగంగా రామాలయ ప్రాంగణంలోని మిథిలా స్డేడియంలో జరుగుతున్న సాంస్కృతిక కార్య క్రమాలు ఆధ్యాంతం భక్తిభావాన్ని పెంపొంది
స్తున్నాయి.  ఈ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పరుశురామునిగా రఘురాముడు ముక్కోటికి 105 ప్రత్యేక బస్సులు

ముస్తాబవుతున్న హంస వాహనం
 Raghuramudu is Parusuramudi  Embodimentభద్రాచలం టౌన్: ఈనెల 8 వ తేదీన గోదావరి నదిలో స్వామివారు నదీ విహారం చేయనుండటంతో అందుకు సంబంధించిన ప్రత్యేక హంస వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక లాంచీని తెప్పించిన అధికారులు దానికి అందంగా రంగులు అద్ది హంస రూపాన్ని తీసుకోస్తున్నారు. ఇప్పటికే కోద్దిమేరా పనులు పూర్తయ్యాయి. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో పనులు ముగించి నదిలో ట్రైల్ రన్ సైతం నిర్వహించనున్నారు.

భద్రాచలం:  ముక్కోటి విచ్చేసే యాత్రి కుల సౌకర్యార్థం టిఎస్ ఆర్టిసి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 105 సర్వీస్‌లను తిప్పనున్నట్లు భద్రాచలం డిపో మేనేజర్ నర్సింహా తెలిపారు. బుధవారం డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి ముక్కోటి సందర్భంగా రాష్ట్ర నలు మూల నుంచే కాకుం డా పోరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ప్రయాణ వెసులుబాటు
కోసం బస్ సర్వీసులను తిప్పుతున్నట్లు చెప్పారు. అదే విధంగా భద్రాచలం నుంచి పర్ణశాల వరకు బస్సులు సిద్ధంగా ఉంటాయని, ఉష్ణ గుండాల వరకు కూడా బస్సులు తిప్పుతామని చెప్పారు. భక్తులు ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా ఉండాలని, ఇతర ప్రయాణ సాధనాలను ఆశ్రయించడం ద్వారా అనేక ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని సూచించారు.