Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్…

 Raging seniors on junior student

కేరళ: ప్రైవేట్ కళాశాలలో బికాం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ పాల్పడిన సంఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటు చేసుకుంది.  సెప్టెంబర్ 5న ఇడుక్కి జిల్లాలో  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాగమెన్ క్యాంపస్ కళాశాలలో అతుల్ మోహన్ అనే జూనియర్ విద్యార్థిపై సెకండియర్ విద్యార్థులు ఐదుగురు దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయ పడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిపై దాడికి పాల్పడిన ఐదుగురు విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. వ్యక్తిగత కారణాల వల్ల సీనియర్లు విద్యార్థిపై దాడికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తుండగా..తనపై సీనియర్లు ర్యాగింగ్ పాల్పడ్డారని బాధిత విద్యార్థి పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments