Search
Wednesday 26 September 2018
  • :
  • :

కేరళ కోసం పాట పాడిన రెహమాన్

Rahman dedicates one of his iconic songs to Kerala flood victims

తిరువనంతపురం : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలైమంది. సుమారు నాలుగు వందల మంది చనిపోయారు. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 5000 పునరావాస కేంద్రాల్లో వరద బాధితులు తలదాచుకున్నారు. కేరళ వరద బాధితుల కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఓ పాటను పాడి, దానిని వారికి అంకితం చేశారు. ‘ ప్రేమదేశం’లోని ‘ ముస్తఫా … ముస్తఫా ’ అనే పాటను పేరడీగా చేసి ‘ కేరళ … కేరళ … డోన్ట్ వర్రీ కేరళ … ’ అంటూ పాటను ఆలపించారు. రెహమాన్ ప్రస్తుతం అమెరికాలో కచేరీలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన కచేరీలో పాల్గొన్న రెహమాన్ కేరళ ప్రజలకు ధైర్యం చెబుతూ ఈ పాటను పాడి, వారికి అంకితం చేశారు.

Rahman dedicates one of his iconic songs to Kerala flood victims

Comments

comments