Home జాతీయ వార్తలు తప్పుడు వాగ్దానాలు చేయను : రాహుల్‌

తప్పుడు వాగ్దానాలు చేయను : రాహుల్‌

Rahul Gandhiకేరళ : ప్రజా క్షేమమే ధ్యేయంగా సాగే తాను ఎన్నడూ తప్పుడు వాగ్ధానాలను చేయనని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని వర్గాల ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కేవలం ధనవంతులైన పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, నీరవ్ మోదీ వంటి వారికే ప్రధాని మద్ధతు ఇస్తున్నారని రాహుల్ దుయ్యబట్టారు. ఇండియన్‌ ఫిషర్‌మెన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కేరళలోని త్రిస్సూర్‌లో నిర్వహించిన నేషనల్‌ ఫిషర్‌మెన్‌ పార్లమెంట్‌ సమావేశంలో ఆయన మత్స్యకారులతో మాట్లాడారు. భారత్ ప్రజలు తమ భావాలను నిర్మొహమాటంగా, స్వేచ్ఛగా ప్రకటించేందుకు అవకాశం కల్పించడమే  తమ ప్రధమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. పేదలకు అండగా ఉండే కాంగ్రెస్, బడా పారిశ్రామికవేత్తలకు అండగా ఉండే బిజెపిల మధ్య జరుగుతున్న సమరం ఇది అని రాహుల్ తెలిపారు. భారత బ్యాంకులకు వేల కోట్లను ఎగ్గొట్టి విదేశాల్లో దాచుకుంటున్న వారికే మోడీ మద్ధతు పలుకుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమ కాంగ్రెస్ మాత్రం పేదల పక్షాన నిలబడి పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో యావత్ భారత ప్రజలు కాంగ్రెస్ మద్దతు తెలపాలని ఆయన కోరారు. తప్పడు వాగ్ధానాలతో గత ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపిని నిలదీయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Rahul Comments on PM Modi