Search
Saturday 17 November 2018
  • :
  • :

రానున్నఎన్నికల్లో కర్నాటక ఫలితాలే పునరావృతం: రాహుల్

Rahul-gandi

న్యూఢిల్లీ: యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్, జెడిఎస్ నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కర్నాటక ఫలితాలే దేశమంతటా పునరావృతమవుతాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బలనిరూపణకు ముందే బిజెపి ప్రభుత్వం కర్నాటకలో కుప్పకూలిన విషయం విదితమే. కర్నాటక విధాన సభలో ఏం జరిగిందో అందరూ చూశారని రాహుల్  అన్నారు. స్పీకర్, భాజపా ఎంఎల్ఎలు జాతీయ గీతం ఆలపించకుండానే సభ నుంచి బయటకు వెళ్లిపోయారని తెలిపారు. అర్ఎస్ఎస్, మోడీ, అమిత్ షా కలిసి ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. కర్నాటక ప్రజలకి, దేవెగౌడ, జెడిఎస్ కార్యకర్తలందరికి అభినందనలు తెలిపారు. విపక్షాలన్నీ కలిసి రానున్న ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తాయని  ధీమా వ్యక్తం చేశారు. ఎంఎల్ఎలను కొనుగోలును ప్రధాని మోడీ పోత్సహించారని విమర్శించారు.  బిజెపి నేతలు ఎంఎల్ఎలతో ఫోన్ లో జరిపిన బేరసారాలు బహిర్గతం అయ్యాయని చెప్పారు. తరుచూ అవినీతి గురించి మాట్లాడే… మోడీ కర్నాటకలో అవినీతిని ఎందుకు ప్రోత్సహించారని రాహుల్ ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి నేతలు నాశనం చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలో బిజెపి ఆగడాలను అడ్డుకున్నమని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలు, వ్యవస్థల కంటే ప్రధాని గొప్పవాడు కాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Comments

comments