Home జాతీయ వార్తలు కోర్టుకు హాజరైన రాహుల్‌గాంధీ

కోర్టుకు హాజరైన రాహుల్‌గాంధీ

rahul-gandhiగువాహటి : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురువారం గువాహటి కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం రాహుల్ ఉత్తరప్రదేశ్‌లో కిసాన్ యాత్ర చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వేసిన పరువు నష్టం కేసులో విచారణలో భాగంగా ఆయన కోర్టుకు హాజరయ్యారు. రాహుల్‌గాంధీ గతేడాది డిసెంబరు 12న అసోం పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ప్రణాళిక ప్రకారం రాహుల్ 16వ శతాబ్దం నాటి బార్పెటా ఆశ్రమానికి వెళ్లారు. అనంతరం రోడ్‌షోలో పాల్గొనాల్సి ఉంది. అయితే రాహుల్ రోడ్ షో నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఈ ఘటనపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆశ్రమానికి వెళ్లనివ్వకుండా తనను కొందరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో ఆశ్రమ ం, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్ఠకు భ ంగం కలిగించేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ ఓ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త పరువు నష్టం కేసు వేశారు,.