Search
Wednesday 19 September 2018
  • :
  • :

కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ

funny satires on rahul gandhi in twitterముంబయి : ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం మహారాష్ట్రలోని భివండిలో ఉన్న మెజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ పై నమోదైన పరువు నష్టం కేసుపై నేడు కోర్టులో విచారణ జరిగింది. ఇందుకోసం ఆయన కోర్టుకు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 2014 మార్చిలో మహాత్మా గాంధీ హత్య అంశంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ ఆయనపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసు విచారణను మార్చి 3వరకు వాయిదా వేసింది.

Comments

comments