Home జాతీయ వార్తలు రాహుల్ గాంధీ బ‌యోపిక్ : టీజ‌ర్ విడుద‌ల‌ (వీడియో)

రాహుల్ గాంధీ బ‌యోపిక్ : టీజ‌ర్ విడుద‌ల‌ (వీడియో)

Rahul Gandhiముంబయి : జాతీయ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ జీవితంపై ఓ బ‌యోపిక్ రూపొందుతోంది. ’ మై నేమ్ ఈజ్ రాగా‘  అనే టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో రాహుల్ గాంధీ వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ జీవితాన్ని చూపించ‌నున్నారు. సెయింట్ డ్రాకులా, కామ‌సూత్ర వంటి సినిమాలను తీసిన  పాల్ రూపేష్ ద‌ర్శ‌క‌త్వంలో ’ మై నేమ్ ఈజ్ రాగా‘ తెర‌కెక్కుతోంది, ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ను తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో గాంధీ ఫ్యామిలీకి చెందిన వారంద‌రిని చూపిస్తూ రాహుల్ రాజ‌కీయ ఆరంగేట్రం జ‌రిగిన విధానాన్ని వివరించారు. ఇది రాహుల్ బ‌యోపిక్ కాద‌ని, రాహుల్ పై  జ‌రుగుతున్న దాడి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడో చూపించే ఇతివృత్త‌మ‌ని ద‌ర్శ‌కుడు రూపేశ్ తెలిపారు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలు భరించి రాహుల్ విజ‌యం సాధించిన త‌ర్వాత ఎవ‌రు ఆప‌లేరని దర్శకుడు రూపేశ్ తెలిపారు. ఇదే సినిమా క‌థ అంటూ ద‌ర్శ‌కుడు పేర్కొన్నాడు. సినిమా బృందం యూఎస్‌లోని కొల్లిన్ కాలేజ్‌, ఇట‌లీని ఆయ‌న అమ్మమ్మ ఇంట్లో కొన్ని కీల‌క స‌న్నివేశాలు షూట్ చేయనున్నారు. ఈ సినిమాలో  క్రియాశీల రాజకీయాల్లో ప్రియాంక ప్రవేశాన్ని చివ‌రి సీన్‌గా షూట్ చేస్తామ‌ని రూపేశ్ వెల్లడించారు. 2019 ఎన్నికలకు  ముందు ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Rahul Gandhi Biopic: Teaser Release