Home జాతీయ వార్తలు ప్రధాని మోడీకి రాహుల్‌ కౌంటర్‌… (వీడియో)

ప్రధాని మోడీకి రాహుల్‌ కౌంటర్‌… (వీడియో)

Modi-and-rahul-gandhi-image

డిల్లీ:  మోడీ ప్రభుత్వం మహిళా సంరక్షణకు ఎంతగానో కృషి చేస్తున్నా.. కాంగ్రెస్ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తుందని ఓ కార్యకర్త మాటలకు స్పందించిన మోడీ అవాస్తవాలు చెప్పడం కాంగ్రెస్ నైజమన్నారు. కర్నాటక ఎన్నిల్లో భాగంగా శుక్రవారం ఆ రాష్ట్రంలోని భాజపా మహిళా మోర్చా కార్యకర్తలతో ప్రధాని మోడీ నమో యాప్ ద్వారా మాట్లాడిని విషయం విదితమే. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్లతో దాడికి దిగారు. మోడీ ఎక్కువగానే మాట్లాడుతారు కానీ  చేతల్లో ఉండవని ట్వీట్టర్ లో రాహుల్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. డియర్ మోడీజీ మీరు చాలా బాగాగే స్పందించారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీ మాటలకు చేసే పనులకు అసలు సంబంధమే ఉండదన్నారు. తమ మాటల్లో ఉన్న నిజాయితీ కర్నాటక బిజెపి అభ్యర్థుల ఎంపిక చేయడంలో లేదన్నారు. కర్నాటక ”మోస్ట్ వాంటెడ్” ఎపిసోడ్ లాగా మీ మాటలున్నాయని మిమర్శించారు. అవినీతిపరులైన గాలి బ్రదర్స్ సన్నిహితులలైన 8 మందికి మీరు టికెట్లు ఇచ్చారు. ఈ విషయంపై 5నిమిషాలు మాట్లాడుతారా..?  మీ సిఎం అభ్యర్థి అయిన యడ్యూరప్పపై చీటింగ్, అవినీతి, ఫోర్జరీ వంటి 23 కేసులు  నమోదైయ్యాయి. ఇవన్నీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆశ పడుతున్నవ్యక్తికి ఉండాల్సిన లక్షణాలేనా..?అని ప్రశ్నించారు. భాజపాలోని  మరో 11 మంది అగ్రనేతలకు అవినీతి చిట్టా గురించి ఎప్పుడు మాట్లాడతారు..? భాజపా మాజీ మంత్రి  శ్రీరాములు మీద మూడు కేసులున్నాయి. గాలి జనార్దన్ తమ్ముడైనా సోమశేఖర రెడ్డిపై 5 క్రిమినల్ కేసులున్నాయి. కంపాలి నుంచి పోటీకి దిగుతున్న గాలి అనుచరుడిపై ఆరు క్రిమినల్ కేసులున్నాయి. బిజెపి కి చెందిన మాజీ హౌసింగ్ మంత్రి కట్టా సుబ్రహ్మణ్య నాయుడు మీద 4 కేసులున్నాయి. చిక్కమంగళూరు అభ్యర్థిపై మూడు క్రిమినల్ కేసులున్నాయి. ఇప్పుడు భాజపా ఎంపిగా కొనసాగుతున్న శోభా కరణ్ డ్లజెపై  మనీ లాండరింగ్ కేసు ఉందన్నారు. ఇన్నీ కేసులపై మీరు  నోరువిప్పుతారని తాను ఆశిస్తున్నట్టు రాహుల్ పేర్కొన్నారు. అంతే కాకుండా మీ సమాధానం కోసం  ఎదురుచూస్తూ… ఉంటామని చెప్పారు. మీరు అనుకులంగా అన్నిపేపర్ లో రాసుకొని  చేతిలో పేపర్ పట్టుకునే సమాధానాలు చెప్పొచ్చుఅంటూ మోడీకి ట్వీట్టర్ వేదికగా సవాల్ వేశారు. కర్నాటకలోని 224 అసెంబ్లీ స్థానాల్లో మే 12న ఎన్నికలు  జరగనున్నా విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రెండు జాతీయ పార్టీలు ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 7 రోజులే మిగలడంతో పార్టీలు ఇకరిపై ఒకరు మాటలు మాటల యుద్ధానికి సై అంటన్నారు.