Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రైతుల రుణబకాయిలన్నీ మాఫీ

Rahul Gandhi Election Campaign in Chhattisgarh

రాజనందగావ్ : ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పది రోజులలో రైతుల రుణ బకాయిలను రద్దు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రంలో తొలి విడత ప్రచార గడువుకు ఒక రోజు ముందు ఆయన శుక్రవారం సుడిగాలి పర్యటన జరిపారు. బిజెపి నేత, రాష్ట్ర సిఎం రమణ్‌సింగ్ బరిలో ఉన్న రాజనంద్‌గావ్‌లో రాహుల్ పలు సభలలో పాల్గొన్నారు. రోడ్‌షోలు నిర్వహించారు. రుణాల భారం రైతాంగానికి దుర్భరం అవుతోందని, దీనిని కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని, రాష్ట్రం లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతాంగానికి తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి పంట రుణాలు, ఇతరత్రా బకాయిలను కేవలం పది రోజుల వ్యవధిలో మాఫీ చేసి తీరుతామని రాహుల్ ప్రకటించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పలు అనాలోచిత నిర్ణయాలకు దిగిందని, దీనితో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని రాహుల్ అస్త్ర సంధానం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన జిఎస్‌టి నిజానికి వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) కాదని, అది గబ్బర్ సింగ్ టాక్స్ అని విమర్శించారు. వినియోగదారులను, వ్యాపారులను అన్ని విధాలుగా దెబ్బతీసే విధంగా ఈ పన్నుల తతం గం ఉందని ఆరోపించారు.
అధికార బిజెపి మాదిరిగా తాము తప్పుడు బూటకపు వాగ్దానాలకు దిగబోమని, చెప్పింది చేసితీరుతామని, రైతాంగ రుణమాఫీ తమ వాగ్దానం అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇచ్చిన హామీల అమలులో వెనుకంజ వేసింది లేదని, పంజాబ్ ఆ తరువాత కర్నాటక ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే రైతుల రుణ బకాయిలను రద్దు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే వెంటనే రుణాల మాఫీ చేపడుతామని వెల్లడించారు. ఏ రైతూ రుణభారంతో ఉండకూడదనేదే తమ పార్టీ ఆలోచన విధానం అని రాహుల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత 15 ఏండ్లుగా ప్రతిపక్షంలో ఉంది. ఎన్నికలు జరిగే ఈ రాష్ట్రంలో రైతాంగానికి తమ పార్టీ రుణాల మాఫీతో పాటు ఇతరత్రా ప్రోత్సాహకాలు కూడా కల్పిస్తుందని రాహుల్ తెలిపారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌పై కాంగ్రెస్ తరఫున ఇక్కడి నుంచి వాజ్‌పేయి మేనకోడలు కరుణ పోటీలో ఉన్నారు. దీనితో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా ఉంది.

Rahul Gandhi Election Campaign in Chhattisgarh

Telangana News

Comments

comments