Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రాహుల్‌ మానస సరోవర యాత్రపై బిజెపి డౌట్

Rahul Gandhi in Kailash Mansarovar yatra

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మానస సరోవర యాత్రపై అధికార, విపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి. బిజెపి సందేహాలకు, కాంగ్రెస్‌ సవాళ్లతో ఈ టాపిక్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆగస్టు 31న రాహుల్‌ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది లేకుండానే మానస సరోవర్‌ యాత్రకు వెళ్లారు. హిమాలయాల దారిలో ఓ యాత్రికుడితో ఫొటో దిగారు రాహుల్. ఈ ఫొటోలో రాహుల్‌ వాడిన చేతికర్ర నీడ మాయమవ్వడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌  అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఫొటో షాప్‌ మాయాజాలంలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బిజెపి సోషల్‌ మీడియా ఇన్‌చార్జి ప్రీతీ గాంధీ కూడా రాహుల్‌ నిజంగానే యాత్రకు వెళ్లారా..? లేక ఇంటర్నెట్‌లో ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసి పెడుతున్నారా..? అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్‌ కూడా ఘాటుగా సమాధానమిచ్చింది. ద్వేషించే వాళ్లు రాహుల్‌ గాంధీకి దీటుగా నిలబడగలరా అని ప్రశ్నించింది. కైలాసగిరి ముందు రాహుల్‌ నవ్వుతూ దిగిన ఫొటోను, 463 నిమిషాల్లో ఆయన 46,433 అడుగులు నడిచారని తెలిపే ‘ఫిట్‌బిట్‌’ స్క్రీన్‌షాట్‌ను ఆమె పోస్టు చేసింది. ‘శివుడే విశ్వం’ పేరుతో రాహుల్‌ కూడా శుక్రవారం హిమాలయాల వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

Comments

comments