Search
Saturday 22 September 2018
  • :
  • :

రాహుల్‌గాంధీతో పెళ్లి అబద్ధం

Rahul Gandhi Marriage with MLA Aditi Singh is Lying

లక్నో : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లి త్వరలోనే జరగనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రాయ్‌బరేలీ ఎంఎల్‌ఎ అదితీ సింగ్‌ను రాహుల్ పెళ్లాడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అదితీ సింగ్ స్పందించారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆమె తేల్చి చెప్పారు. రాహుల్‌తో తన పెళ్లి జరుగుతున్నట్టు వస్తున్న వార్తలు తనను ఎంతగానో బాధిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ తనకు అన్నయ్యతో సమానమని ఆమె పేర్కొన్నారు. ఆయన తనకు రాఖీ బ్రదర్ అని ఆమె తేల్చి చెప్పారు. ఇటువంటి వార్తలకు ఇకనైనా స్వస్తి చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్పందించలేదు. అదితీ సింగ్ గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. విదేశాల్లో మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ చదివిన అదితీ సింగ్ గత ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లోకి వచ్చారు. అదితీసింగ్ ప్రియాంకా గాంధీ వాద్రాకు అత్యంత సన్నిహితురాలు.

Rahul Gandhi Marriage with MLA Aditi Singh is Lying

Comments

comments