Home జాతీయ వార్తలు ఏ యూనివర్సిటీలో చదివారు మోడీ: రాహుల్

ఏ యూనివర్సిటీలో చదివారు మోడీ: రాహుల్

 

Rahul-Gandhi

 

 

మణిపూర్: ప్రధాని నరేంద్ర మోడీ ఏ యూనివర్సిటీలో చదివారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. బుధవారం విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోడీ డిగ్రీపై ఓ ఆర్‌టిఐ కార్యకర్త పోరాడుతున్నాడని, ఇప్పటి వరకు ఆర్‌టిఐ నుంచి ఎటువంటి సమాధానం రాలేదని ఎద్దేవా చేశారు. మోడీ అసలు  యూనివర్సిటీ వెళ్లి చదివారా ? లేదా ? అనే అనుమానం రాహుల్ వ్యక్తం చేశారు. ఎక్కడ  విద్యను అభ్యసించారో చెప్పాలని అడిగారు. దూర విద్యతో పట్టాలు పొందే వారికి తాను వ్యతిరేకం కాదని, దూర విద్యలో చదివిన వారికి కూడా నాలెడ్జ్ బాగా ఉంటుందని పొగిడారు. గతంలో మోడీ విద్యార్హతపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. మోడీ తన పార్లమెంట్ ఎన్నికల అఫిడివిట్ లో  బిఎ, ఎంఎ డిగ్రీలను ఢిల్లీ యూనివర్సిటీ, గుజరాత్ యూనివర్సిటీలో చదివానని పొందుపరిచారు. 

 

Rahul Gandhi Questions on Modi’s Qualification in Imphal