Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పారిశ్రామికవేత్తలకే రుణాలు మాఫీ: రాహుల్ గాంధీ

Rahul Gandhi said Industrialists Got Crores
హైదరాబాద్: శంషాబాద్ లోని కన్వెషన్ హాల్ లో మహిళా స్వయం సహాయ  బృందాలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ…మోఢీ పాలనలో రుణాలు మాఫీ అయ్యేది పారిశ్రామికవేత్తలకే తప్ప , మహిళలకు, రైతులకు,మహిళా స్వయం సహాయ  బృందాలకు మాత్రం కాదని రాహుల్ గాంధీ విమర్శించారు.  రెండేళ్ల ఎన్ డిఏ పాలనలో  15 మంది పారిశ్రామికవేత్తలకు రూ.2.5లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో అభయహస్తం పింఛన్ పథకాన్ని, పావలా వడ్డీ రుణాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలకు రుణ సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు.

Comments

comments