Home జాతీయ వార్తలు చౌకీదార్‌కు జనం రెస్టివ్వాలనుకుంటున్నారు

చౌకీదార్‌కు జనం రెస్టివ్వాలనుకుంటున్నారు

Rahul-Gandhi

సుపాల్ (బీహార్): చౌకీదార్‌ను విధుల నుంచి తప్పించాలని దేశప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మోడీని ఉద్దేశించి శనివారం వ్యాఖ్యానించారు. ‘చౌకీదార్ (వాచ్‌మేన్) పాత్ర పోషిస్తానని హామీ ఇచ్చి ఆయన (మోడీ) ప్రజల్ని ఓట్లడిగారు. కానీ ఆయన అనిల్ అంబానీ ఇష్టాలకు అనుగుణంగా ఆయనకు చౌకీదార్ అయ్యారు. కాబట్టి ప్రజలిప్పుడు ఆయనను చౌకీదార్ డ్యూటీ నుంచి తప్పించి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు’ అని రాహుల్ ఇక్కడ ఒక ఎన్నికల ర్యాలీలో చెప్పారు.
మోడీపై దాడిని కొనసాగిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు …‘ఇవాళ చౌకీదార్ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. అది ఓడిపోతాననే భయం. ప్రజలముందు దాన్ని దాచుకోలేకపోతున్నారు. అంతేకాదు… రాఫెల్ ఒప్పందంపై సరైన దర్యాప్తు జరిగితే, ఈ చౌకీదారు, ఈయనతో పాటు అనిల్ అంబానీ జైలుకెళ్ల వలసి ఉంటుంది. సరే…ఆయన ప్రయత్నమేదో ఆయన్ను చేయనివ్వండి. కానీ దేశ ప్రజలు మరోసారి ఆయన ప్రధాని కావడానికి అనుమతించరు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

Rahul gandhi Speech on modi in Election Campaign