Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎపిికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతా: రాహుల్‌

ఎపిికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతా: రాహుల్‌

Rahul Gandhi Meetingఅమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎపికి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. హోదా ఇవ్వకుండా ఏ శక్తీ తమను అడ్డుకోలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన ‘భరోసా సభ’లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ… ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా 125 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు.
ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఆ హామీ ఇచ్చింది సాధారణ వ్యక్తి కాదని, ప్రధాని స్థాయి వ్యక్తి అని గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే, ఎపిలో ఏ పార్టీ అధికారంలోకొచ్చినా, ఏ ప్రభుత్వం ఉన్నా తాము ఇచ్చిన హామీని నెరవేర్చుతామని తన ప్రసంగంలో రాహుల్ చెప్పారు. అంతకుముందు, ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న ముని కోటి చిత్రపటానికి రాహుల్ గాంధీ నివాళులర్పించారు.
Rahul Gandhi Tirupati Meeting