Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కేరళకు రాహుల్‌గాంధీ

Rahulఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదివారం కేరళలో పర్యటించనున్నారు. కొల్లంలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగి 102 మంది చనిపోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ మృతులకు నివాళులు అర్పించి, గాయపడినవారి కుటుంబాలతో రాహుల్ మాట్లాడుతారని ఏఐసిసి అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు కేరళ సిఎం వూమెన్ చాందీతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని 13 ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతులకు పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.

Comments

comments