Home ఆదిలాబాద్ రాహుల్ టూర్ రద్దు వెనుక మతలబేమీటి…?

రాహుల్ టూర్ రద్దు వెనుక మతలబేమీటి…?

Rahul Gandhi visit In Adilabad District

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన నేరటిగొండలో కాకుండా భైంసాకు మార్చడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట జిల్లా పార్టీ నాయకులంతా వ్యూహాత్మకంగా రాహుల్ సభ ను నేరడిగోండలో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికోసం గాను ఆ పార్టీ స్థానిక నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా నేరడిగొండను సందర్శించి బహిరంగ సభ వేదికపై సమీక్షించారు. అయితే అనూహ్యంగా నేరడిగొండలో కాకుండా భైంసాలో రాహుల్ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆదివారం రాష్ట్ర నాయకులు ప్రకటించారు. దీంతో పాటు సోమవారం టిపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి తదితర పార్టీ సీనియర్ నాయకులు భైంసాను సందర్శించి బహిరంగ సభ స్థాలాన్ని పరిశీలించారు. అయితే రాహుల్ బహిరంగ సభ నేరడిగొండలో రద్దు కావడం పట్ల ఆక్కడి పార్టీ వర్గాలే కాకుండా రాజనీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇక్కడి సభ రద్దు వెనుక భద్రత కారణాలు ఉన్నాయని  ఆ పార్టీ నాయకులు వెల్లడిస్తున్నప్పటికి అసలు కారణాలు మరోరకంగా ఉన్నాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

మొదట గిరిజన ఒటర్లను లక్షంగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు సమీపంలోఉన్ననేరడిగొండను ఎంపిక చేశారు. అయితే వాస్తవానికి బోథ్ సెగ్మెంట్‌లో లంబాడ ఆదివాసి తెగల మద్య వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే బోథ్ నుంచి ఆదివాసి నాయకులు స్వయం బాపురావు టికెట్టును ఆశిస్తుండగా లంబాడ తెగకు చెందిన అనిల్ జాదవ్ కూడా టికెట్టు రేసులో ఉన్న విషయం తెలిసిందే రాహుల్ పర్యటన సందర్భంగా స్వయం బాపురావు, అనిల్ జాదవ్‌లు బలప్రదర్శన జరిపే అవకాశంతో పాటు టికెట్ల కోసం డిమాండ్ చేసి పరిస్థితులు ఏర్పాడుతాయన్న కారనంతోనే రాహుల్ సభను భైంసాకు మార్పు చేసినట్లు సమాచారం. రాహుల్ సమక్షంలో ఆదివాసీ, లంబాడ తెగల మధ్య వివాదం సైతం చోటు చేసుకునే అవకాశం ఉందని ఇంటలీజెన్స్ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తుంది. అయితే పార్టీ నాయకులు పోలీసు మాత్రం ఈ అంశాన్ని పక్కన పెట్టి మావోయిస్టుల కదలికల సమాచారం మేరకే రాహుల్ పర్యటనను మార్పు చేశామంటూ అసలు వాస్తవాన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని రెండు మూడు సెగ్మెంట్‌లలో లంబాడల ఓట్ల కన్న ఆదివాసిల ఓట్లు ఎక్కువగా ఉండడమే కాకుండా అభ్యర్థుల గెలుపు ఓటములలో వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది.

బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆటు లంబాడలకు ఇటు ఆదివాసీలకు అసలు విషయం వెల్లడికాకుండా మావోయిస్టుల ప్రభావం పేరిట రాహుల్ సభను మార్పు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ నెల 20 తేదిన రాహుల్ సభను బైంసాలో నిర్వహించబోతున్నారు. మొదటి దశ ఎన్నికల ప్రచార నేపధ్యంలో నిర్వహించనున్న రాహుల్ గాంధీ సభను కాంగ్రెస్ పార్టీ ప్రతీష్టాత్మకంగా తీసుకుంటుంది. పెద్దఎత్తున జనాన్ని సమీకరించి పార్టీపై పాజిటివ్ దృక్పథంతో నెలకొనే విధంగా చూడాలని లక్షంగా పెట్టుకుంటున్నారు. రాహుల్ సభ ప్రభావం రాష్ట్రలోని అన్నీ సెగ్మెంట్లపై ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.