Search
Friday 21 September 2018
  • :
  • :

కేరళ వరద ప్రాంతాల్లో రాహుల్ పర్యటన

Rahul Gandhi visit Kerala

సహాయక శిబిరాల్లో బాధితులకు పరామర్శ

తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం వరద పీడిత కేరళ రాష్ట్రంలో పర్యటించారు. ఇటీవలకురిసిన భారీ వర్షాలు, వరదల్లో కేరళ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం బ్రిటన్‌నుంచి నేరుగా తిరువనంతపురం చేరుకున్న రాహుల్ అక్కడినుంచి చెన్‌గన్నూర్ వెళ్లారు. అక్కడ ఓ ఇంజనీరింగ్ కాలేజిలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి వెళ్లి బాధితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, తామంతా ఆదుకోవడానికి ఉన్నామని ఓదార్చారు. విమానాశ్రయం వద్ద రాహుల్‌కు స్థానిక ఎంపి శశి థరూర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం చాలకుడిలో వరదబాధితులను పరామర్శించారు. క్రిస్టియన్ కాలేజిలో తలదాచుకున్న బాధితులను కలిశారు. రాహుల్ ఈ రోజు వరదల్లో బాగా దెబ్బతిన్న అలప్పుజ, చెంగన్నూర్, ఎర్నాకుళం జిల్లాల్లో పర్యటించారు. బుధవారం వయనాడ్, కోజికోడ్ జిల్లాల్లో పర్యటిస్తారు.

‘రియల్ హీరో’లకు సన్మానం
కేరళ వరదల్లో చిక్కుకున్న వేలాది మంది బాధితులను కాపాడి వారిని సహాయక శిబిరాలకు చేర్చడంలో మత్సకారులు చూపిన తెగువ, సాహసాలను రాహుల్ గాంధీ ప్రశంసించారు. మీరే రియల్ హీరోలంటూ ప్రశంసలు కురిపించారు. కేరళ సహాయక చర్యల్లో విరివిగా పాల్గొన్న మత్పకారులను రాహుల్ మంగళవారం సన్మానించారు. అలప్పుజలోని కామెలెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో రాహుల్ మత్సకారులను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. వారికి మెమెంటోలు అందజేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే మత్సకారుల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు కేరళ వరదల్లో మృతి చెందిన వారికి నివాళిగా ఒక నిమిషం మౌనం పాటించారు. రాహుల్ వెంట కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితల, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఎం హస్సన్ తదితరులు ఉన్నారు. అంతకు ముందు తాను కేరళలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు రాహుల్ ఒక ట్వీట్‌లో తెలియజేశారు.

Comments

comments