Home తాజా వార్తలు సోమ్‌నాథ్ ఆలయంలో రాహుల్ పూజలు

సోమ్‌నాథ్ ఆలయంలో రాహుల్ పూజలు

RAHUL

గుజరాత్ : సోమ్‌నాథ్ ఆలయంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ సోమనాథ్‌డికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇటీవల జరిగిన గుజరాత్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా రాహుల్ గుజరాత్‌లోని పలు ఆలయాలతో పాటు సోమనాథ్ ఆలయాన్ని కూడా సందర్శించారు. రాహుల్ ఆలయాలను సందర్శించడంపై బిజెపి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ స్పందించారు. తమ కుటుంబం శివారాధన చేస్తుందని ఆయన పేర్కొన్న విషయం విదితమే. గుజరాత్ అసెంబ్లీకి కాంగ్రెస్ తరపున కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎలతో రాహుల్ శనివారం భేటీ కానున్నారు.

Rahul Gandhi Visited the Somnath Temple