Home జాతీయ వార్తలు ‘అమ్మ’ను పరామర్శించిన రాహుల్ గాంధీ

‘అమ్మ’ను పరామర్శించిన రాహుల్ గాంధీ

Rahul-and-Jayalalithaచెన్నై: నగరంలోని అపోలో ఆస్పత్రిలో గత 15 రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తమిళనాడు సిఎం జయలలితను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్న రాహుల్‌ను అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులను అడిగి అమ్మ ఆరోగ్యం వివరాలను రాహుల్ తెలుసుకున్నారు. ఊపిరితిత్తులు, మధుమేహం, అస్తమా ఇన్‌ఫెక్షన్లకు సంబంధించి జయలలితకు చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. లండన్ వైద్యుడు రిచర్డ్ బేలె ఆధ్వర్యంలో అమ్మకు చికిత్స కొనసాగుతోంది.