Search
Sunday 18 November 2018
  • :
  • :

మోడీ… ఉపాధి ఎక్కడ?: రాహుల్

Rahul-Gandhi

ఢిల్లీ: జిఎస్‌టి పేరుతో చిన్న వ్యాపారుల జేబులో చేయి పెట్టి మోడీ ప్రభుత్వం లాక్కుంటుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్డిఎ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా లోక్ సభలో రాహుల్ మాట్లాడారు. ఒక్కసారిగా దేశంనెత్తిన జిఎస్‌టిని రుద్దారని, డిజిల్, పెట్రోల్‌ను జిఎస్‌టి పరిధిలో ఎందుకు తేలేదని ప్రశ్నించారు.  గతంలో మోడీ ఈ దేశానికి తాను  ప్రధాని మంత్రిని కాదని, కాపలాదారుడినని చెప్పారని, అమిత్ షా తనయుడు జయ్ షా ఆస్తుల పెరుగుదల మోడీకి కనిపించలేదా అని ధ్వజమెత్తారు. జయ షా ఆస్తులపై అంత వివాదం జరిగినా ప్రధాని ఒక్కమాట కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు.

21 శతాబ్దపు రాజకీయ ఆయుధానికి ఎపి ప్రజలు బాధితులని, టిడిపి ఎంపి గల్లా జయదేవ్ ప్రసంగంలో ఎపి ప్రజల బాధ, ఆవేదన అర్థమైందన్నారు. ప్రధాన మంత్రి అనే పదానికి అర్థం భారత ప్రజానీకం వెతుకుతోందని ఎద్దేవా చేశారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు, ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని, మోడీ ఇచ్చిన ఉపాధి హామీలన్నీ నీటిమూటలేనని మండిపడ్డారు. 2014లో దేశం మొత్తం మీద నాలుగు లక్షల మందికే ఉపాధి లభించిందని గుర్తు చేశారు.  ఒకరోజు పకోడి వేసుకోమని చెబుతారు.. ఇంకో రోజు దుకాణం తెరుచుకోమని చెబుతారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. అకస్మాత్తుగా రాత్రి ఎనిమిది గంటలకు వచ్చి నల్లధనం మొత్తం పెకిలించి వేస్తామని చెప్పారు.. ఎంత బ్లాక్ మనీని బయటకు తీశారని మోడీని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చిన పెద్ద నోట్ల రద్దుతో చిన్న, మధ్యతరగతి సంస్థలన్నీ రోడ్డున పడ్డాయని రాహుల్ గుర్తు చేశారు.  ఆ సంస్థల్లో పని చేస్తున్నవారు ఉపాధి కోల్పోయారని,  మోడీ సృష్టించిన ఉపాధి ఎక్కడి ఉంది అని అడిగారు.

Comments

comments