Home జాతీయ వార్తలు మీ ‘మన్ కీ బాత్’ వినడానికి వచ్చా…

మీ ‘మన్ కీ బాత్’ వినడానికి వచ్చా…

Rahul Gandhi

 

దుబాయ్: ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ వ్యంగ్య బాణాలు రువ్వారు. నేను దుబాయ్‌కు వచ్చింది నా ‘మన్ కీ బాత్’ చెప్పడానికి కాదు..మీ మన్ కీ బాత్ వినడానికి అంటూ ఇక్కడి భారతీయ కార్మికులనుద్దేశించి రాహుల్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా తొలి సారి యుఎఇకి వచ్చిన రాహుల్ గాంధీకి దుబాయ్ విమానాశ్రయంలో ప్రవాస భారతీయులు గురువారం ఆత్మీయ స్వాగతం పలికారు. యుఎఇలో కష్టపడుతూ భారతదేశానికే గర్వకారణంగా నిలిచిన భారతీయ కార్మికులను ఆయన అభినందించారు. ప్రతి మతం, రాష్ట్రం, కులం పేర్లకు మీరు వన్నెతెచ్చారంటూ ఆయన కీర్తించారు.  ప్రధాని నరేంద్ర మోడీ రేడియో ద్వారా ప్రతి నెల నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, తాను ఇక్కడకు తన మనసులోని మాటను చెప్పడానికి రాలేదని, మీ మనసులో మాటను తెలుసుకోవడానికే వచ్చానని రాహుల్ చెప్పారు. దీనికి ముందు రాహుల్ ఇక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు.

Rahul Jibes at PM while Referring to Modi’s Mann Ki Baat, Rahul said that he came to Dubai for not telling his Mann Ki Baat,Telangana news