Home జాతీయ వార్తలు పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా … తిరస్కరించిన సిడబ్ల్యుసి

పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా … తిరస్కరించిన సిడబ్ల్యుసి

Rahulఢిల్లీ:  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) తిరస్కరించింది. ఎన్నికల్లో ఓటమిపై చర్చించేందుకు శనివారం సిడబ్ల్యుసి భేటీ అయింది. ఈ భేటీలో రాహుల్ గాంధీతో పాటు యుపిఎ చైర్ పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, అగ్రనేతలు గులాం నబీ ఆజాద్‌, ఏకే ఆంటోనీ, మల్లికార్జున్‌ ఖర్గే, పంజాబ్‌ సిఎం అమరీందర్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. ఓటమికి దారి తీసిన కారణాలపై వారు చర్చించారు. ఈ క్రమంలో ఓటమికి తానే బాధ్యుడినంటూ రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాహుల్ రాజీనామాను సిడబ్ల్యుసి అంగీకరించలేదు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సిడబ్ల్యుసి నిర్ణయించింది. ఈ క్రమంలోనే సంస్థాగత మార్పులు చేయాలని కూడా సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నేతలు తెలిపారు.

Rahul Resigns To President Post … CWC Rejected