Home రాజన్న సిరిసిల్ల జిల్లా సహాయ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ శర్మ

జిల్లా సహాయ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ శర్మ

Rahul Sharma is the District Assistant Collector

మన తెలంగాణ / సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సహాయ కలెక్టర్‌గా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ శర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 2017 వ సంవత్సర బ్యాచ్ కు చెందిన రాహుల్ శర్మ ముస్సోరిలో శిక్షణ పొందారు. ఈ నెల 11న శిక్షణ పూర్తి కాగానే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సహాయ కలెక్టర్‌గా ప్రభుత్వం కేటాయించింది. సహాయ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌శర్మకు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జెసి షేక్ యాస్మిన్‌భాషా, డిఆర్‌వో శ్యాంప్రసాద్‌లాల్, రెవెన్యూ సిబ్బంది లు స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో ఏడాది పాటు జిల్లాలో ఉండి అన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై అవగాహన ఏర్పర్చుకోనున్నారు. ఈ మేరకు రాహుల్ శర్మ జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు సమాచారం అందించారు. రాహుల్ శర్మ తండ్రి పికె శర్మ హిందూ కళాశాల ప్రిన్సిపల్‌గా, తల్లి అరుణ శర్మ పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా అదే కళాశాలలో పనిచేస్తున్నారు.