Home జాతీయ వార్తలు గుజరాత్‌లో రాహుల్ పర్యటన

గుజరాత్‌లో రాహుల్ పర్యటన

RAHUL

అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక్కడ తిరిగి అధికారంలోకి రావాలని బిజెపి వ్యూహం పన్నుతోండగా, ఈ సారి ఈ రాష్ట్రంలో పాగా వేయాలని కాంగ్రెస్ ప్రతివ్యూహం పన్నుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం గుజరాత్‌లో పర్యటించారు. రాష్ట్రంలోని 180 నియోజకవర్గాలకు చెందిన నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సారి గుజరాత్‌లో కాంగ్రెస్ అధిరాంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికార బిజెపి వైఫల్యాలను ఆయన ఎండగట్టారు.

Rahul’s tour in Gujarat