Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

తక్కువ భూసేకరణతో రైల్వేలైన్ అలైన్‌మెంట్:ఎంపి

MP-Vinod-kumar-image

మనతెలంగాణ/సిరిసిల్ల: సిరిసిల్లలోతక్కువ భూసేకరణతో రైల్వేలైన్ అలైన్‌మెంట్ రూపొందించాలని ఎంపి బోయినిపల్లి వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో రైల్వే అధికారులతో సమావేశమైన ఎంపి వినోద్‌కుమార్ కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ అలైన్‌మెంట్ కోసం చేసే భూసేకరణకు సంబంధించి పలుసూచనలు చేశారు. రైల్వే అధికారులు ప్రతిపాదించిన వివిధ రైల్వేలైన్ అలైన్‌మెంట్లను ఆయన పరిశీలించారు.ప్రజలకు రైల్వేస్టేషన్ అనుకూలంగా ఉండేలా భూ సేకరణ జరపాలన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్,జెసి యాస్మిన్ భా ష,డిఆర్‌ఒ శ్యాంప్రసాద్‌లాల్,దక్షిణమధ్యరైల్వే కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లికార్జున్, డిఇఇ సుదర్శన్, రెవెన్యూ డివిజనల్ అధికారి పాండురంగ పాల్గొన్నారు.

Comments

comments