Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రైల్వేలో ఖాళీలు 60 వేలకు పెంపు

rail-way

న్యూఢిల్లీ : ఆగస్టు 9న నిర్వహించనున్న అసిస్టెంట్ లోకో పైలట్ల ఖాళీలను 26,502 నుంచి 60 వేలకు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 48 లక్షల మంది హాజరుకానున్నారు. ఖాళీలను పెంచడం వల్ల అత్యధికులకు ఉద్యోగాలు దక్కుతాయని రైల్వే మంత్రి పియూష్ గొగొయ్ తెలిపారు. అభ్యర్థులు ఇ కాల్ లెటర్‌ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలు ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయని, దానిలో పరీక్ష కేంద్రంతోపాటు తేది, సమయం కూడా ఉం టుందని మంత్రి తెలిపారు. ఎస్సి, ఎస్టి అభ్యర్థులు ఉచితంగా రైలులో ప్రయాణించడానికి రైల్వే విడుదల చేసిన ఇ కాల్ లెటర్‌ని డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఆర్‌ఆర్‌బి వెబ్‌సైట్ అందుబాటులో ఉందని ఆయన చెప్పారు.

Comments

comments