Home మెదక్ రెండేళ్లలో మెదక్ రైల్వేలైన్

రెండేళ్లలో మెదక్ రైల్వేలైన్

Harish-Raoభారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
అక్కన్నపేట – మెదక్ రైల్వేలైన్ పనులకు భూమి పూజ
రైతుల త్యాగం మరువలేనిది 
కంటితడి పెట్టిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి
మన తెలంగాణ/మెదక్: రెండేళ్లలో రైల్వేలైన్ నిర్మాణం పనులను పూర్తిచేసి జిల్లాలో రైలు కూత పెట్టేలా చూస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన మెదక్-రామాయంపేట రహదారిపై పాతూర్ – అవుసులపల్లి శివారు గ్రామం లోని పాత చక్కెర ఫ్యాక్టరీ వద్ద అక్కన్నపేట – మెదక్ రైల్వేలైన్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భం గా ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పా టు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. చిరకాల స్వ ప్నం మెదక్ జిల్లా కేంద్రం రైల్వేలైన్ నిర్మాణం ఘణపు రం ప్రాజెక్ట్ పునఃరుద్ధరణ, మెదక్ పట్టణం నందనవ నం, ఇంటింటికీ మంజీరా జలాలతో దశా-దిశ మార్చి న ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి సభలో ఆనంద భా ష్పాలు రాల్చారని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. గత పాలకులు మాటలు తప్ప పనులు చేయలేదని విమ ర్శించారు. ఇప్పుడు మెదక్ పట్టణం అన్ని రంగాల్లో విరా జిల్లుతుందన్నారు.

రైల్వేలైన్‌కు సగం రాష్ట్ర ప్రభుత్వమే..
అక్కన్నపేట – మెదక్ రైల్వేలైన్ కోసం భూమిని రైల్వే శాఖకు ఉచితంగా ఇవ్వడమే కాకుండా, ఆ నిర్మాణంలో సగం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైల్వేలైన్ కోసం 285 ఎకరాల భూమి సేకరణ కోసం రూ.35 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రైల్వేలై న్ నిర్మాణం కోసం ఇప్పటివరకు రూ.11 కోట్లతో పా టు, రూ.35 కోట్ల్లు భూ నిర్వాసితులకు సిఎం కెసిఆర్, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు చెల్లించి నట్లు వివరించారు. అంతకుముందు మాట్లాడిన ఉప స భాపతి పద్మాదేవేందర్ రెడ్డి ప్రజా బలంతోనే మెదక్ ని యోజకవర్గాన్ని అభివృద్ధి చేయగల్గుతున్నానని, రైల్వేలై న్ కోసం రైతులు చేసిన త్యాగం మరువరానిదని, చిరకా ల స్వప్నం నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందని కంటతడి పెట్టారు. అనంతరం మెదక్ ఎంపి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర పాలనలో కొత్త రైల్వేలైన్ వేసిన పాపానపోలేదని విమర్శించారు. రెండు, మూడు నెలల్లో మనోహరాబాద్ – గజ్వేల్ – సిద్దిపేట – కొత్తపల్లి రైల్వేలైన్‌కు భూమి పూజ చేయబోతున్నట్లు ఆయన పే ర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డిఒ మెంచునగేశ్, జడ్ పిటిసి లావణ్యరెడ్డి, మెదక్, రామాయంపేట ఎంపిపిలు లక్ష్మి కిష్టయ్య, పుట్టి విజయలక్ష్మి, మున్సిపల్ వైస్‌చైర్మ న్ రాగి అశోక్, పట్టణ, పార్టీ మండలాధ్యక్షులు గంగా ధర్, రాయిన్‌పల్లి అంజాగౌడ్, టిఆర్‌ఎస్ ప్రధాన కార్య దర్శి ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, జీవన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్‌లు డా.సురేందర్, డా. సురేశ్, డా. చంద్రశేఖర్‌తో పాటు వివిధ సంఘాల నేతలు, యువజ న సంఘాలు, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొ న్నారు. అంతకుముందు పట్టణంలో బైక్ ర్యాలీ తీశారు.