Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

కంప్యూటర్ ద్వారా ఉద్యోగ పరీక్ష: రైల్వేశాఖ

Railways first computer based exam on Aug 9

న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ఉద్యోగుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలను మొదటి సారిగా కంప్యూటర్ ద్వారా నిర్వహించనున్నామని  రైల్వే శాఖ తెలిపింది. లోకో పైలట్లు, టెక్నీషియన్లకు సంబంధించి 26,502 ఖాళీల భర్తీలకు  ఆగస్టు 9న పరీక్ష నిర్వహించనున్నామని ప్రకటించింది. ఈ పరీక్షలను కంప్యూటర్ ద్వారా నిర్వహిస్తామని పేర్కొంది.  అభ్యర్థుల హాల్ టిక్కెట్లను  పరీక్షకు నాలుగు రోజుల ముందు  నుంచి రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకొవాలని రైల్వే శాఖ కొరింది.

Comments

comments