Search
Saturday 22 September 2018
  • :
  • :

శిథిలావస్థలో పాఠశాల భవనం…

rain has become a scourge for Salaguda school students

బజార్‌హత్నూర్‌: చిన్నపాటి వర్షం వచ్చిందంటే చాలు టెంబి గ్రామ పంచాయతీలోని సాలేగుడా పాఠశాలలో వర్షం నీరు చెరుతుంది. ఉన్నది ఒకే రూం కావున ఏమి చేయలేక విద్యార్థులు ఇంటి బాటా పడుతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాలేగుడ పాఠశాల విద్యార్థులకు శాపంగా మారింది. పై కప్పు పగుల్లు తేలడం, కిటికిలకు తలుపులు లేకపోవడం, లోతట్టు ప్రాంతంలో పాఠశాల ఉండటం వలన వర్షపు నిరంత పాఠశాలలోకి చేరి విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ పాఠశాలలో 64 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్‌లు వున్నారు. పాఠశాల సక్రమంగా నడిచిన వర్షం పడితే మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు భవనం పగుల్లు తేలడంతో పైనుండి దారాలుగా నీల్లు పడుతున్నాయి. గత సంవత్సరం బడి బాటాలో ఈ గ్రామ విద్యార్థులంత ప్రైవేటు పాఠశాల మానేసి ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ప్రస్తుతం పాఠశాల భవనం శితిలావస్థలో వుండటం, వర్షం పడితే ఇంటికి విద్యార్థులు రావడం చూసి తల్లిదండ్రులు అందోళన చేందుతున్నారు. అధికారులు పట్టించుకురని శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

comments