Home Default తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణకు వర్ష సూచన

Rainహైదరాబాద్ : శుక్ర , శనివారాల్లో తెలంగాణలో తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ విదర్భ నుంచి కోస్తా కర్నాటక వరకు మరాఠ్వాడ, మధ్యమహారాష్ట్ర మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితలద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి కారణంగా వచ్చే రెండు రోజుల్లో హైదరాబాద్ గ్రేటర్‌లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నట్టు వారు చెప్పారు.

Rain in Telangana on Today and Tomorrow