Home మంచిర్యాల మంచిర్యాల జిల్లాలో వర్ష భీభత్సం

మంచిర్యాల జిల్లాలో వర్ష భీభత్సం

Rain terror in the District of mancherial

ఉప్పొంగిన వాగులు – నిలిచిన రాకపోకలు 

మనతెలంగాణ/మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల వాగులు ఉప్పొంగి రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచి పోయా యి. దాదాపు జిల్లాల్లో 24 గ్రామాలకు రవాణా సౌకర్యాలు స్తంభించి పోయాయి. పలు రూట్లలో అధికారులు ఆర్‌టిసి బస్సులను నిలి పి వేశారు. భారీవర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొ రగడంతో  పలు గ్రామాలు అంధకార మయమయ్యాయి.  పలు చోట్ల భారీ వృక్షాలు విరిగిపోయి రోడ్డుకు అడ్డంగాపడడంతో రాకపోకలకు అంత రాయాలు ఏర్పడినాయి. గోదావరినది వరద ప్రవాహం పెరుగు తుండ డంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వా యర్ లోకి కూడా వరదనీరు తరలి వస్తోంది. దీంతో ఇటీవల డెడ్ స్టోరేజికి చేరుకున్న ఎస్ ఆర్ ఎస్‌పీ వరద నీటితో పూర్వ వైభవం వైపు పరు గులు తీస్తోంది. ప్రతీ సంవ త్సరం మాదిరిగానే ఈసారి కూడా తొలకరి వర్షాలకే  మారుమూల ప్రాంతా ల్లోని రోడ్లన్నీ బురదమయంగా మారి కాలినడక కూడా కష్టంగా మారింది.  వాగులు ఉప్పొంగడంతో అత్యవసర పనుల నిమి త్తం ప్రజలు ప్రాణాలకు తెగించి వాగులను దాటుతున్నారు. పలు చోట్ల వాగులు దాటకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా లోని జన్నారం, లక్షెట్టిపేట, దండేపల్లి, భీమారం, చెన్నూర్, వేమన పల్లి, నెన్నెల, భీమిని మండలా లతో పాటు కొమురంభీం జిల్లాలోని తాండూర్, రెబ్బెన, కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట, బెజ్జూర్, మండలాల్లో  సోమవారం  భారీ వర్షం  కురిసింది. చెన్నూర్ మార్గంలోని సుద్దాల వాగు, దహెగాంలోని ఎర్రవాగు, బెజ్జూర్‌లోని మత్తడి వాగులు, ఉప్పొంగగా జన్నారంలోని తాత్కాలిక రోడ్డు భారీ వర్షాలకు కొట్టుకొపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించి, విద్యార్థులు సైతం ఇండ్లకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అంతే కాకుండా జిల్లా వ్యాప్తంగా 9 ఇండ్లు, మరో 12 ఇండ్ల   గోడలు కూలిపోయినట్లు  సమాచారం అందింది. ఏదిఏమైనా తొలకరి వర్షాలకే రోడ్లన్నీ బురదమయంగామారి కాలినడక కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. వాగులు  ప్రతీ సంవత్సరం  ఉప్పొంగడం వల్ల మారుమూల గ్రామాలకు  రవాణా సౌకర్యాలు నిలిచిపోయినప్పటికీ వంతెనలు నిర్మించే విషయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.