Home ఛాంపియన్స్ ట్రోఫీ భారత్-పాక్ మ్యాచ్ : మళ్లీ వర్షం!

భారత్-పాక్ మ్యాచ్ : మళ్లీ వర్షం!

Shikkar-Dhawan

బర్మింగ్ హామ్ : చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కు మళ్లీ వర్షం అడ్డంకిగా నిలిచింది. దాయాదుల మధ్య జరుగుతున్న ఈ కీలక పోరు వర్షం కారణంగా మళ్లీ వాయిదా పడింది. పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 33.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 173 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్ లో ధావన్ 68, రోహిత్ శర్మ 77, విరాట్ కోహ్లీ 24 పరుగులు చేశారు. పాక్ బౌలింగ్ లో షాదాబ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.