Search
Wednesday 14 November 2018
  • :
  • :

వరుణుడి కోసం రైతన్న ఎదురు చూపులు

Rains in Telangana bring smile on farmers faces

తుంగతుర్తి: జూన్ మోదటి వారం లో కురిసిన భారీ వర్షాలకు రైతాంగం దుక్కులు దున్ని,పత్తి, పెసర పంటలను సాగు చేయడం జరిగింది. ఖరీఫ్ ఆరంభంలో కురిసిన వర్షాలతో ఆనందం వ్యక్తం చేసిన రైతాంగానికి విత్తిన విత్తనాలు మొలకెత్తే దశలో కొన్ని మొలకలు బయటకు వచ్చి ఉన్న తరుణంలోనే వరుసగా వారం రోజుల నుండి వర్షం కురవక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షం జాడ లేదు సరికదా ఎండ తీవ్రత వేసవిని మరపిస్తోందని , భూమిలోని తేమ పూర్తిగా హరించిపోతోందని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క మండుటెండ,రెండో పక్క ఈదురు గాలులు తోలు తుండటంతో మొలచిన మొలకలు వాడి పోతున్నాయని రైతులు అంటున్నారు. ఇంకా కొంత మంది రైతులు విత్తనాలు వేయకుండా వర్షం ఎపుడు కురుస్తుందని అని ఆకాశం వైపు చూస్తు మబ్బులు ఎపుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఆకాశం నిర్మలంగా, ఎండ తీవ్రంగా ఉండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. నైరుతి ఋతుపవనాలు ఇంకా వారానికి చేరుకుంటాయని,వస్తున్న వార్తలతో రైతులు మరింత బెంబేలెత్తుతున్నారు. ప్రతి రోజు ఉదయాన్నే లేవగానే రైతన్నలు ఆకాశం వంక చూడడం సాయంత్రంలోగా చిన్న చిరుజల్లైనా కురవదా అని ఆశగా ఎదురు చూడడం తీరా చీకట్లు కమ్మే వరకు చినుకు జాడ లేకపోవడం భారంగా నిరాశగా ,కలతగా నిదురపోవడం గత 10 రోజులుగా సాగుతోంది. వరుణుడి కరుణ కోసం అనునిత్యం ఎదురు చూస్తున్న రైతన్న ఆశలు నెరవేరాలని ,ఒకటి,రెండు భారీ వర్షాలు కురవాలని ఆశిద్దాం.

Comments

comments